TGMSలో బాలసభ కార్యక్రమం.. బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన
బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి: గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలంలోని TGMS పాఠశాలలో బాలసభ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ బాల్యవివాహాలు సమాజ అభివృద్ధికి ఆటంకమని, వాటి వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా పర్యావరణ కాలుష్యం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
అనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజన వంటశాలను తనిఖీ చేసి, భోజన ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో TGMS వైస్ ప్రిన్సిపాల్ బి. నాగేశ్వర్ రావు, ఉపసర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చక్రపాణి, వార్డు సభ్యులు శ్రావణ్, విష్ణు, సాగర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

























