లింబాద్రిగుట్టపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు
జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్: లింబాద్రిగుట్ట జాతరను పురస్కరించుకుని ఆర్మూర్ సబ్ కలెక్టర్, మున్సిపల్ చైర్‌పర్సన్ మరియు పాలకవర్గం ఆదేశాల మేరకు గుట్టపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ తెలిపారు.
ఈ సందర్భంగా గుట్టపై డివైడర్ల వెంబడి పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు, రహదారులను పూర్తిస్థాయిలో శుభ్రం చేశారు. అలాగే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను తొలగించి, రోడ్లపై స్వీపింగ్ పనులు చేపట్టారు.
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. జాతర సమయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు మున్సిపల్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని తెలిపారు.

























