రామడుగు గ్రామంలో రైతుల సమస్యలపై ఎంపీడీవో సమావేశం నిర్వహించారు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండలం రామడుగులో శుక్రవారం ఎంపీడీవో మారుతి, సర్పంచ్ పార్వతి రమేశ్ రైతు వేదికలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీడీవో మారుతి మాట్లాడుతూ.. రైతు వేదికలో రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నందున బోరు బావులు తవ్వకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ, ఉప సర్పంచ్, గ్రామస్థులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.























