గొడవల్లో నోటిని కంట్రోల్ చేయాలి: డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణ : కుటుంబ వ్యవస్థలో దంపతులు సర్దుకుపోవాలని, ఒకరినొకరు అర్థం చేసుకుని మెలగాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో ‘మీ సురక్ష– కలిసుంటే కలదు సుఖం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భార్యాభర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు ముందుగా నోటిని కంట్రోల్‌లో పెట్టుకోవాలని, కోపం వచ్చినప్పుడు చెడ్డ మాటలు రాకుండా చూసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారని, సంసార జీవితాన్ని కొనసాగించాలని సూచించారు.























