నిజమైన అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలి.గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలి
ప్రజా ప్రభుత్వంలో అందిస్తున్న రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధి దారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.విద్యా వ్యవస్థలో ప్రజా ప్రభుత్వం తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి.ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసేందుకు సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలి..తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందిచేలా చర్యలు తీసుకోవాలి.
మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లుల చెల్లింపులు కచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలి99 డేస్ ప్రోగ్రాం లో గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి























