నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా….
సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్ మండలాల రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో యూరియా యాప్ బుకింగ్ పద్ధతిని రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నినాదాలు చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో పార్టీలకతీతంగా మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు, బిజెపి పార్టీ కిషన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డిలు ధర్నాకు మద్దతు పలుకుతూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు వైయస్ సాగర్, గాండ్ల సంతు మాట్లాడుతూ…. ఈ యూరియా యాప్ విధానమనేది రైతులకు ఏమాత్రం సరికాదని, రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉందని, చదువుకున్న రైతులే ఈ యాప్ బుకింగ్ విధానంతో ఇబ్బంది పడుతూ బుకింగ్ చేసిన అరకొరగా యూరియా అందుతుందని, యాప్ ఓపెన్ చేసేంతలోపే యూరియా అయిపోతుందని, అటువంటిది చదువుకోని వారికైతే అసలు మొబైల్ యూస్ చేయడమే రాదని, అందులో కొందరికి ఆండ్రాయిడ్ ఫోన్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామీణ ప్రాంతాలలో నెట్వర్క్ లేక సతమతమవుతున్నారని,వెంటనే రైతులకు అనుకూల విధానమైన పాత పద్ధతిని ఆవలంబిస్తూ తక్షణమే యూరియా యాప్ ను రద్దు చేయాలని, లేదంటే రైతుల నుండి తీవ్ర పరిణామాలు ప్రభుత్వం ఎదురుకోక తప్పదని హెచ్చరించారు.



















