Homeతెలంగాణయూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్

నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన యూరియా యాప్ రద్దు ధర్నాకు రైతుల మద్దతు దొరకలేదని, యూరియా యాప్ రద్దు చేయాలంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లడం సరికాదని, రైతులు నమ్మొద్దని మంగళవారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పత్రికా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. యూరియా యాప్ ద్వారా ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి యూరియా బస్త అందాలనే ఉద్దేశంతోనే యాప్ విధానం చేయడం జరిగిందని, జిల్లా రైతులకు సరిపడేంత యూరియాను గోదాములలో నిలువ చేయడం జరిగిందని, రైతులు అధైర్య పడద్ద ని, నందిపేట మండలంలో దాదాపు 22 వేల ఎకరాలు వరి సాగవుతుంటే దాదాపుగా 19 వేల యూరియా బస్తాలను రైతులు బుక్ చేసుకుని వాళ్ళ ఇళ్ళలో పెట్టుకోవడం జరిగిందని, మిగతా వారందరికీ కూడా యూరియా బస్తాలు అందుతాయని సొసైటీలలో గోదాములలో నిలువ చేసి ఉన్నాయని, రైతుల మద్దతు కోల్పోయిన ప్రతిపక్షాలు రైతుల పక్షాన పోరాటం చేస్తున్నట్టు నటించడం కొరకే ఈ ధర్నాలు చేస్తున్నారని, అందుకే ఆ ధర్నాలకు రైతుల మద్దతు కరువైందని, అందులో పార్టీల నాయకులే ఉన్నారని రైతులు లేరని ఐలాపూర్ పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ సిద్దాపురం సుదర్శన్ విమర్శించారు. ఎకరాకు రెండు బస్తాలు చొప్పున యూరియా బస్తాలు గోదాంలలో నిల్వ ఉన్నాయని ఎవరు అధైర్య పడద్దని, ఎకరాకు మూడు బస్తాలు చొప్పున యూరియా అందేటట్టు కూడా ప్రయత్నం చేస్తామని, రైతులు కూడా అధిక సంఖ్యలో యూరియాను వాడొద్దని, కొందరు రైతులు ఇష్టానుసారంగా యూరియాని వాడడం వల్ల భూసారం దెబ్బతింటుందని, భూసారం పెంచేందుకు ప్రభుత్వం జీలుగు విత్తనాలను పంపిణీ చేస్తుందని జీలుగు విత్తనాలు రైతులు వాడక, తీసుకోక విత్తన బ్యాగులన్నీ రిటర్న్ పంపించే పరిస్థితులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. నందిపేట సర్పంచ్ సిలిండర్ లింగం మాట్లాడుతూ… విజయవాడ దగ్గరలోని నిమ్మకూరు ప్రాంతంలో ఓ ఊరిలో దొండ సాగుతో వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారని, దొండ సాగు కొరకు యూరియా బస్తాలను ఎకరానికి ఐదు బస్తాల వరకు వాడేసరికే నేడు గ్రామంలో మొత్తం ఏ ఒక్క పంట పండకుండా భూసారమంతా తగ్గిపోయి ఎటువంటి పంటలు కూడా పండకుండా తయారైంద ని, భూమికి క్యాన్సర్ వచ్చినట్టు తయారవడంతో రైతులు తమ తప్పును తెలుసుకొని భూసారం పెంచేందుకు ఆర్గానిక్ పంటలవైపు సాగును మొదలుపెట్టారని గుర్తు చేశారు… అందుకే దయచేసి రైతులంతా ఏకరాకు రెండు బస్తాలు మించకుండా యూరియా వేసుకుని జీలుగు విత్తనాలు, వివిధ రకాల ఆర్గానిక్ పంటల వైపు చూడాలని విజ్ఞప్తి చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందమహిపాల్ మాట్లాడుతూ.. ఉమ్మడి నందిపేట మండలంలో యూరియా యాప్ వల్ల ఎటువంటి నష్టం లేదని ఎందుకంటే మా నందిపేట మండల ప్రాంతంలో సాదా బైనామా భూముల వల్ల యూరియా యాప్ తో కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నది వాస్తవమేనని, అంతే తప్ప రైతులంతా యూరియా యాప్ వినియోగించుకొని దాదాపు ఇప్పటివరకు 19వేల బస్తాలను రైతులు బుక్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. దేశంలోనే దిగుబడిలో మా ఆర్మూర్ ప్రాంత రైతులు పంజాబ్ రైతులతో పోటీపడి పై చేయి సాధిస్తున్నారని, యాప్ వినియోగంలో కూడా ముందంజలో ఉన్నారని, నిజాంబాద్ జిల్లాలో దాదాపుగా మూడు లక్షల మంది రైతులు ఉంటే యూరియా యాప్ ప్రారంభించిన పది రోజులలో నే లక్ష 50 వేల మంది రైతులు యూరియాను బుక్ చేసుకొన్న విషయం నాయకులు తెలియదా అని ఎద్దేవా చేశారు,. పట్టా పాస్ బుక్కు లేనివారు, చిన్న సన్నకారు రైతులు కొంతమంది మాత్రమే ఈ యాప్ ద్వారా ఇబ్బంది పడుతున్నారని ఆ సమస్యను కూడా అధిగమించి సాదా బైనామా భూములకు సమాధానం వెతుకుతామన్నారు. మరీ ముఖ్యంగా ఈ యూరియా యాప్ విధానమనేది కేంద్ర ప్రభుత్వం గమనిస్తుందని, పట్టా పాస్ బుక్ రైతులు క్యూ లైన్ లో నిలబడకుండా, నేరుగా రైతు లబ్ధిపొందే విధంగా ఉందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తెలంగాణాను ఆదర్శంగా తీసుకొని పక్కన గల ఏపీలో పైలెట్ ప్రాజెక్టుగా పెట్టేందుకు యోచిస్తుందనేది గుర్తు చేశారు. సాంకేతికతను వాడుకోవడంలో రైతులంతా ముందుంటే నాయకులు మాత్రం రాజకీయం చేస్తూ.. రైతుల మద్దతు లేకుండా వెనుకబడి పోతున్నారని మహిపాల్ విమర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

0
బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు మంగళవారం : 16/06/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్, జూన్ 16 (త్రిశూల్ న్యూస్): మహారాష్ట్ర రాష్ట్రంలోని హింగోలి జిల్లా భస్మత్ ప్రాంతానికి చెందిన 14...

ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

0
ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత...

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ

0
డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు డ్రమ్ సీడర్ల పంపిణీ సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  రైతుల సంక్షేమం మరియు వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే లక్ష్యంతో డాక్టర్ రెడ్డీస్...

నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా…

0
నందిపేట మండల కేంద్రంలో రైతుల ధర్నా.... సోమవారం : 15/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 15 లోకల్ న్యూస్: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో సోమవారం నందిపేట, డంకేశ్వర్...

తలేగావ్ ఆలయంలో తిరిగి ప్రతిష్టించిన తర్వాత 1.3 కిలోల వెండి కిరీటం దొంగిలించబడింది

0
పూణే: మే 23న తాలెగావ్ దభాడేలోని ఆలయంలో తుల్జాభవానీ దేవత కోసం 1.3 కిలోల బరువున్న వెండి కిరీటాన్ని దొంగలు మొదట అపహరించారు.ఓ గుర్తు తెలియని వ్యక్తి భక్తుడిలా నటిస్తూ...

Translate »
error: Content is protected !!