Homeత్రిశూల్ న్యూస్ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి

ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి

జ్యోతిబాపూలే బాలికల గురుకులాలలో వైద్య ఆరోగ్య శిబిరం సందర్శన

నిజామాబాద్ మార్చి 20: ఆరోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువు, క్రీడలు, ఇతర అంశాలపై చక్కగా దృష్టి సారించవచ్చని హితవు పలికారు. మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద గల మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల/కళాశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తాచెదారం, ఇతర వ్యర్థాలను రోజువారీగా తరలించేందుకు వీలుగా స్వచ్చ ఆటోను పాఠశాలకు పంపాలని సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు. గురుకులంలోని కిచెన్ ను, విద్యార్థినుల కోసం వండిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. నాణ్యమైన సరుకులు, తాజా కూరగాయలు వినియోగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.     ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. వివిధ విభాగాల వారీగా విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, చక్కటి ఆరోగ్యం కోసం ఆకు కూరలు, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, వెంటనే నిర్వాహకుల దృష్టికి తీసుకురావాలని, అశ్రద్ధ చేయకూడదని అన్నారు. సరైన ఆహార నియమాలను పాటిస్తూ, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని విద్యార్థినులకు మార్గనిర్దేశం చేశారు. ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా, వార్షిక పరీక్షలను ఆత్మవిశ్వాసంతో చక్కగా రాయాలని సూచించారు. బాలికల భద్రత, రక్షణ, ఆరోగ్యాల పరిరక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని, బయటి వ్యక్తులు ఎవరూ పాఠశాల లోనికి రాకుండా గట్టి పర్యవేక్షణ చేయాలని పాఠశాల నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్వేత, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ స్వప్న, వైద్యులు సందీప్, శశిధర్, అరవింద్ తదితరులు ఉన్నారు. 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి..

0
రైతుల పొలాలలో ఫారం పాండ్, కమ్యూనిటీ స్థలాల్లో నీటి కుంట లను నిర్మించుకోవాలి.. ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... జలసిరి కార్యక్రమంలో భాగంగా భీంగల్ మండలం బాబా నగర్ క...

ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్…

0
ముందస్తు అరెస్టులను ఖండించిన TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... రాష్ట్ర గవర్నర్ పర్యటనకువస్తున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు పేరిటఅరెస్ట్ "సిపిఐ (ML) మాస్ లైన్ జిల్లా...

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

Translate »
error: Content is protected !!