ధర్పల్లిలో ప్రజావాణికి 5 అర్జీలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మొత్తం 5 అర్జీలు అందాయి.
వాటిలో హౌసింగ్ శాఖకు సంబంధించి 2, ఎంపీడీవో కార్యాలయానికి సంబంధించి 2, రెవెన్యూ శాఖకు సంబంధించి 1 ఫిర్యాదు ఉన్నట్లు ఎంపీఓ శ్రీధర్ తెలిపారు.
ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించినట్లు పేర్కొన్నారు. అర్జీలను పరిశీలించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు ఎంపీఓ శ్రీధర్ తెలిపారు.

























