ధర్పల్లి బస్టాండ్‌లో బస్సులు ఆపేదెక్కడ? ప్రయాణికుల అవస్థలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని పాత బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లోకి రాకుండా కొంత దూరం ముందే నిలిపివేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు బస్సులు ఎక్కేందుకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుండటంతో అవస్థలు పడుతున్నారు. బస్టాండ్ ఏర్పాటు చేసిన ఉద్దేశం నెరవేరేలా ఆర్టీసీ బస్సులను బస్టాండ్‌లోనే నిలిపి ప్రయాణికులను ఎక్కించుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
బస్టాండ్‌లో బస్సులు నిలపకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్న డ్రైవర్లపై సంబంధిత అధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

























