భీంగల్ మాజీ జెడ్పిటిసి చౌట్పల్లి రవి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
ఉద్యమకారుడు, BRS పార్టీ సీనియర్ నాయకుడు, భీంగల్ మండల మాజీ జెడ్పీటీసీ చౌట్పల్లి రవి తండ్రి ఈ రోజు కాలం చేయడంతో వారి అంత్యక్రియల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన పార్థివ దేహానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం చౌట్పల్లి రవి ని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.

























