ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై దాడులు అరికట్టాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం మోహన్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
నిజామాబాద్: ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని రాష్ట్ర అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి పులగం మోహన్ కోరారు.
సోమవారం నిజామాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిపై జరుగుతున్న దాడుల గురించి పులగం మోహన్ వివరించారు. వైద్యులకు రక్షణ కల్పించడంతో పాటు వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేష్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

























