భీమ్గల్ మున్సిపాలిటీలో నూతన పింఛన్లకు దరఖాస్తుల గడువు పొడిగింపు కమిషనర్ డి గజానంద్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు నూతన పింఛన్లు మంజూరు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువును 15-09-2026 వరకు పొడగించడం జరిగినది.
కావున నూతన పింఛన్ల కోసం అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, పైలేరియా బాధితులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అర్హత కలిగిన వారు నిర్ణీత గడువులోగా నూతన పింఛన్ కోసం దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ముఖ్యంగా ఒంటరి మహిళా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు గడువు తేదీకి కనీసం మూడు రోజుల ముందుగానే తమ దరఖాస్తులను మున్సిపల్ కార్యాలయము నందు సమర్పించవలసినదిగా కోరడమైనది.
అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అవసరమైన పత్రాలతో దరఖాస్తులను మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని మున్సిపల్ కమీషనర్ కోరడమైనది.

























