నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లాలో యూత్ కాంగ్రెస్ కార్యవర్గసమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర కో-ఇన్చార్జ్ రోష్ని జైశ్వాల్, జిల్లా ఇన్చార్జ్ అమృత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు, అసెంబ్లీ అధ్యక్షులు, జిల్లా, అసెంబ్లీ, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

























