ధర్మారం (బి)లో గణపతి అభిషేక అలంకరణ, అన్నదానం
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలోని పోచమ్మ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణపతి అభిషేకం, ప్రత్యేక అలంకరణతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గణపతికి ప్రత్యేక అభిషేకం నిర్వహించి, భక్తిశ్రద్ధలతో అలంకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు మధు, సురేష్, గోపి, వాసుతో పాటు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

























