అఖిలభారత రైతు కూలీ సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయండి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
ఖమ్మంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న అఖిలభారత రైతు కూలీ సంఘం నాల్గవ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మహాసభలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. రైతులు, రైతు కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి జేపీ గంగాధర్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు బి. సాయినాథ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులకు ఎరువులు, పురుగుమందుల పంపిణీలో ఆన్లైన్ విధానంతో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. రైతులకు సబ్సిడీలు అందించాలని, రైతులకు సంబంధించిన చట్టాలపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ రైతులు, రైతు కూలీల సమస్యలపై పోరాటాలను కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సాయమ్మ, రాజన్న, లింగం, జీ. లలిత, లక్ష్మి, మురళి, చిన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

























