భీంగల్ మున్సిపాలిటీలో కుక్కల బెడదపై చర్యలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులు స్పందించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ తరఫున వీధి కుక్కలను పట్టుకుని ఏబీసీ (Animal Birth Control) సెంటర్, నిజామాబాద్‌కు తరలించేందుకు పేపర్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు.
ఏజెన్సీ ఎంపిక పూర్తయి సిబ్బంది అందుబాటులోకి వచ్చిన వెంటనే కుక్కలను పట్టుకునే చర్యలు చేపడతామని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

























