ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు మృతి…
తెలంగాణ : ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో (NICU) ఏసీ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆ సమయంలో వార్డులో మెుత్తం 27 మంది పిల్లలకు చికిత్స అందిస్తుండగా.. తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది స్పందించి వారిని బయటకు తీసుకొచ్చారు. మిగిలిన చిన్నారులకు ఇతర ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.























