ప్రమాదాల నివారణకు డిచ్పల్లి పోలీసుల చొరవ
నాగపూర్ గేటు వద్ద ప్రమాదకరంగా ఉన్న గుంతలను మొరంతో పూడ్చివేత…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్ రోడ్డులోని నాగపూర్ గేటు వద్ద ప్రమాదకరంగా మారిన గుంతలను డిచ్పల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొరంతో పూడ్చారు. రోడ్డుపై గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడటంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటాన్ని గుర్తించిన పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రమాదాల నివారణలో భాగంగా గుంతల్లో మొరం పోసి రహదారిని తాత్కాలికంగా సరిచేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిచ్పల్లి పోలీస్ సిబ్బంది దశరథ్, పీసీ ప్రభాకర్ తదితరులు చురుకుగా పాల్గొని గుంతలను పూడ్చే పనులను చేపట్టారు. రహదారులపై ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

























