గణనాథునికి ప్రత్యేక పూజలు…
కామారెడ్డి, సెప్టెంబర్ 22 : త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ హరీష్
కామారెడ్డి పట్టణంలోని శ్రీ సాయి మణికంఠ అపార్ట్‌మెంట్‌లో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణనాథునికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు.
అపార్ట్‌మెంట్‌లోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గణనాథుని నామస్మరణతో అపార్ట్‌మెంట్ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ కార్యక్రమంలో అపార్ట్‌మెంట్ అధ్యక్షుడు అజయ్ రావుతో పాటు మల్లారెడ్డి, హరీష్, రాజిరెడ్డి, రాజేశ్వర్, సుఖేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

























