Homeతెలంగాణసీఎం రేవంత్ డైవర్షన్ రాజకీయాలకు సూత్రధారి...

సీఎం రేవంత్ డైవర్షన్ రాజకీయాలకు సూత్రధారి…

సీఎం రేవంత్ డైవర్షన్ రాజకీయాలకు సూత్రధారి

కపట నాటకానికి పాత్రధారి: బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్‌రెడ్డి…

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు బీఆర్ఎస్ నేతలపై పదేపదే ఆరోపణలు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ఆరోపించారు.

బీఆర్ఎస్ అగ్రనేతలకు చెందిన ఫామ్‌హౌస్‌ల వద్దకు భూముల పరిశీలన పేరుతో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న పర్యటనలు ప్రజల దృష్టిని మళ్లించేందుకు రూపొందించిన రాజకీయ వ్యూహంలో భాగమేనని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ వ్యవహారశైలి దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.

22ఏ నిషేధిత భూముల సమస్యతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం బీఆర్ఎస్‌పై ఎదురుదాడికి దిగుతోందని జీవన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున భూములను 22ఏ జాబితాలో చేర్చడం వల్ల రైతులు, ప్రజలు తమ భూములను విక్రయించుకోలేక, పిల్లల చదువులు, వివాహాలు వంటి అవసరాలకు కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

అసెంబ్లీలో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షం ప్రశ్నిస్తుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులతో దాడులు చేయించారని, మహిళా ఎమ్మెల్యేలను అవమానించారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసి సభకు దూరంగా ఉంచే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

కేసీఆర్ కుటుంబంపై భూముల కబ్జా ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఫామ్‌హౌస్‌ల వద్దకు పర్యటించడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఆయన అన్నారు. భూములు అక్రమమా, సక్రమమా అనేది నిర్ధారించేందుకు అధికార యంత్రాంగం ఉండగా ఎంపీలు, రాజకీయ నాయకులు స్వయంగా పర్యటించడం ఎందుకని ప్రశ్నించారు.

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు సంబంధించి భూముల విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌కు ఎర్రవల్లిలో 62 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉందని, అందులో వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. రూ.లక్ష కోట్ల విలువైన 1,000 ఎకరాల భూమి ఉందంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని విమర్శించారు.

కేసీఆర్ ప్రభుత్వ అసైన్డ్ భూములను ఆక్రమించాల్సిన అవసరం లేదని, ఆయన పట్టా భూములను కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తున్నారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజా మద్దతుతో పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికైన కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్రాన్ని సాధించారని అన్నారు.

ప్రభుత్వం నిజంగా అక్రమ భూములను గుర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, రాజకీయ ఆరోపణలతో సమస్యను పక్కదారి పట్టించకూడదని జీవన్‌రెడ్డి అన్నారు. భూముల వ్యవహారంపై ఆరోపణలు నిరూపితమైతే చర్యలకు సిద్ధమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రైతుబంధు, రైతుబీమా, గురుకుల విద్యాలయాల నిర్వహణ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలు నిర్వీర్యమయ్యాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.

దేశంలో కాంగ్రెస్, బీజేపీ రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలుగా ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నాయని జీవన్‌రెడ్డి ఆరోపించారు. ప్రతి అంశాన్ని బీఆర్ఎస్‌పైకి మళ్లిస్తూ ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

22ఏ నిషేధిత భూముల సమస్యను బీఆర్ఎస్ లేవనెత్తినందుకే తమ పార్టీపై ఎదురుదాడి చేస్తున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. సమస్యను పరిష్కరించకుండా రాజకీయ ఆరోపణలకు దిగడం సరికాదన్నారు.

ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ మరింత ఉధృతంగా పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై పోరాటం ఆపేది లేదని, బీఆర్ఎస్ పోరాటం ఎప్పటికీ ప్రజల పక్షమేనని జీవన్‌రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

బోర్గాం(పీ) లో వైభవంగా గణేష్ నిమజ్జనం.. పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి…

0
బోర్గాం(పీ) లో వైభవంగా గణేష్ నిమజ్జనం.. పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లానిజామాబాద్ రూరల్ లో వాహనంవద్దప్రత్యేకంగా పూజలు.శోభాయాత్రనుప్రారంభించిన ఎమ్మెల్యే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోర్గాం (పీ)...

తెలంగాణ యూనివర్సిటీ లో బాలికల హాస్టల్ వార్డెన్‌గా డాక్టర్.యల్. జ్యోత్స్న…

0
తెలంగాణ యూనివర్సిటీ లో బాలికల హాస్టల్ వార్డెన్‌గా డాక్టర్.యల్. జ్యోత్స్న... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు ఆదేశాల మేరకు గర్ల్స్ హాస్టల్ వార్డెన్‌గా గతంలో...

ధర్పల్లిలో చేయూత దరఖాస్తుల పరిశీలన…

0
ధర్పల్లిలో చేయూత దరఖాస్తుల పరిశీలన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతంలో చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల...

మెంట్రాజ్‌పల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ…

0
మెంట్రాజ్‌పల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలం, సెప్టెంబర్ 22: మెంట్రాజ్‌పల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఎడ్ల ప్రవళిక నిర్వహించారు....

వినాయకనిమజ్జనం సందర్భంగాముందస్తు బైండోవర్ చర్యలు :పోలీస్ కమీషనర్ వెల్లడి…

0
వినాయకనిమజ్జనం సందర్భంగాముందస్తు బైండోవర్ చర్యలు :పోలీస్ కమీషనర్ వెల్లడి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా లో వ్యాప్తంగా 572 మందిబైండొవర్.వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతవాతావరణంలో,ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్...

Translate »
error: Content is protected !!