మెంట్రాజ్పల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా, డిచ్పల్లి మండలం, సెప్టెంబర్ 22: మెంట్రాజ్పల్లి గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఎడ్ల ప్రవళిక నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు.
గ్రామ సర్పంచ్ ఎడ్ల ప్రవళిక చేతుల మీదుగా లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్మార్ట్ కార్డుల ద్వారా అందుబాటులో ఉండే సేవలు, వాటి వినియోగంపై లబ్ధిదారులకు వివరించారు.
ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ లబ్ధిదారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

























