ధర్పల్లిలో చేయూత దరఖాస్తుల పరిశీలన…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాంతంలో చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్‌ను అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల వివరాలు, అర్హతలను పరిశీలించి నమోదు చేశారు.
అర్హులైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పింఛన్లు అందేలా పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

























