బోర్గాం(పీ) లో వైభవంగా గణేష్ నిమజ్జనం.. పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లానిజామాబాద్ రూరల్ లో వాహనంవద్దప్రత్యేకంగా పూజలు.శోభాయాత్రనుప్రారంభించిన ఎమ్మెల్యే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోర్గాం (పీ) లో గణేశ్ నిమజ్జన వేడుకలు మంగళవారం వైభవంగా చేపట్టగా.. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గణపయ్యను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి శోభాయాత్ర చేపట్టగా.. ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. అటు నిమజ్జన వేడుకలకు విచ్చేసిన ఎమ్మెల్యే కు మండప నిర్వాహకులతో పాటు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు సాదరంగా పలికారు.అనంతరం ఎమ్మెల్యే స్థానిక భక్తులను ఆప్యాయంగా పలకరిస్తూ.. సందడిచేశారు.ఆవిఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతాసుఖసంతోషాలతోజీవించాలనిఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఉమారాణి, ముప్ప గంగారెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.























