Homeతెలంగాణహామీలు ఎన్నో.. అభివృద్ధి ఏదీ?

హామీలు ఎన్నో.. అభివృద్ధి ఏదీ?

హామీలు ఎన్నో.. అభివృద్ధి ఏదీ?

రెండేళ్లుగా రోడ్డుపై నరకయాతన!

నిధులు ఎక్కడ? మరమ్మతులు ఎప్పుడు? ప్రజల ప్రశ్నలకు సమాధానమేది?

ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న భీంగల్ ప్రధాన రహదారి!

రెండేళ్లుగా మరమ్మతులకు నోచుకోని భీంగల్–బడా భీంగల్–సికింద్రాపూర్ ప్రధాన రహదారి!

అధికారుల నిర్లక్ష్యానికి ప్రయాణికులే బలికావాలా?

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్

నిజామాబాద్ జిల్లా : భీంగల్ నుంచి బడా భీంగల్, సికింద్రాపూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. రహదారిపై ఎక్కడ చూసినా గుంతలు, దుమ్ము, ధూళితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండేళ్లుగా రహదారి పరిస్థితి ఇలాగే ఉన్నప్పటికీ మరమ్మతులు చేపట్టేందుకు సంబంధిత అధికారులకు సమయం లేకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రధాన రహదారిపై నిత్యం వందలాది మంది ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. రహదారి దెబ్బతినడంతో ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, ఇతర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా గుంతలు తప్పించుకునే క్రమంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము, ధూళి కారణంగా ప్రయాణికులతో పాటు రహదారి వెంట నివసించే ప్రజలు కూడా అవస్థలు ఎదుర్కొంటున్నారు.

రహదారి దుస్థితిపై గతంలో పలుమార్లు పత్రికల్లో కథనాలు ప్రచురితమైనప్పటికీ అధికార యంత్రాంగంలో ఎలాంటి కదలిక కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులపై హామీలు ఇస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పనులు ముందుకు సాగడం లేదని విమర్శిస్తున్నారు.

ప్రజాప్రతినిధుల హామీలు ప్రకటనలకే పరిమితమా? రహదారి అభివృద్ధికి నిధులు ఎప్పుడు మంజూరు చేస్తారు? ప్రమాదాలు జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి భీంగల్–బడా భీంగల్–సికింద్రాపూర్ ప్రధాన రహదారికి వెంటనే నిధులు మంజూరు చేసి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి ప్రజల ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు జరిగినా మారని విధుల కేటాయింపు వ్యవస్థ!

0
ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు జరిగినా మారని విధుల కేటాయింపు వ్యవస్థ! నిజామాబాద్ డిపో-1లో సమాచార కేంద్రానికే పరిమితమవుతున్న కొందరు కండక్టర్లు.. మిగతా సిబ్బందికి న్యాయం ఎక్కడ? త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి  ప్రభాకర్ నిజామాబాద్: ఆర్టీసీలో...

లింబాద్రిగుట్టపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు…

0
లింబాద్రిగుట్టపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్: లింబాద్రిగుట్ట జాతరను పురస్కరించుకుని ఆర్మూర్ సబ్...

జాగీర్యాల్ గ్రామంలో ఘనంగా శ్రీ కనకదుర్గ మాత తొలి వార్షికోత్సవ వేడుకలు…

0
జాగీర్యాల్ గ్రామంలో ఘనంగా శ్రీ కనకదుర్గ మాత తొలి వార్షికోత్సవ వేడుకలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా : భీంగల్ మండలం జాగీర్యాల్ గ్రామంలో శ్రీ కనకదుర్గ మాత తొలి వార్షికోత్సవ...

108 అంబులెన్స్‌లో వైద్య పరికరాల పనితీరు పరిశీలన…

0
108 అంబులెన్స్‌లో వైద్య పరికరాల పనితీరు పరిశీలన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు,...

లిటిల్ హార్ట్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు…

0
లిటిల్ హార్ట్స్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు! సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన విద్యార్థులు.. మదర్స్ మీట్‌లో చిన్నారుల సంరక్షణపై అవగాహన... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల...

Translate »
error: Content is protected !!