ఎస్ఐఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇప్పటివరకు చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా గైర్హాజరైన, వలస వెళ్లిన, డబుల్ ఓటర్లు, మరణించిన (ASDD) ఓటర్లకు సంబంధించిన జాబితాపై అధికారులు వివరించారు. ఆయా ఓటర్లకు సంబంధించి ఈఎఫ్ (EF) ఫారాలు అందినట్లు తెలిపారు. బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఈ ఫారాల ఆధారంగా క్షేత్రస్థాయిలో పునఃపరిశీలన చేపడతారని పేర్కొన్నారు.
అలాగే, పొరపాటున ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వారు ఈఎఫ్ ఫారాల ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకుంటే, నిబంధనల ప్రకారం వారి పేర్లను మళ్లీ ఓటరు జాబితాలో చేర్చేందుకు అవకాశం ఉంటుందని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అధికారులు వివరించారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీపీ నల్ల సారిక, హనుమాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాదె నరేష్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.

























