Homeతెలంగాణప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా...

ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా…

ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి ప్రారంభించారు. అర్హత కలిగిన ప్రతి రేషన్ కార్డు కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు.

ఆదివారం డిచ్‌పల్లి మండలం రాంపూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న అతిథులకు గ్రామస్తులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. సంక్షేమ పథకాల అమలులో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ప్రమాదవశాత్తు కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా రూ.5 లక్షల బీమా పరిహారం అందించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించామన్నారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు మహిళా సంఘాలకు రూ.1,100 కోట్లు అందించామని, మహిళా సాధికారతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

గత పాలకులు మంచిప్ప ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని భారీగా పెంచారని విమర్శించారు. 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ.1,300 కోట్లతో ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందించగా, గత బీఆర్ఎస్ పాలకులు దానిని రూ.3,000 కోట్లకు పెంచారని ఆరోపించారు. రాంపూర్ గ్రామానికి కూడా మంచిప్ప ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేలా ప్రత్యేక కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని, ఈ నెల 26వ తేదీ నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.

అనంతరం ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ.. గతంలో రైతులకు మాత్రమే పరిమితమైన బీమా సౌకర్యాన్ని ఇప్పుడు ప్రతి పేద కుటుంబానికి విస్తరించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. కుటుంబంలో ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా కుదేలవకుండా రూ.5 లక్షల బీమా పరిహారం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.

గత పదేళ్ల పాలనలో కొత్త రేషన్ కార్డుల జారీని పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన అనేక కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కొత్తగా 3,500 మందికి పైగా లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తోందన్నారు. మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ.79 వేల కోట్ల రుణాలు అందించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.

పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని, రానున్న రోజుల్లో భూమిలేని నిరుపేదలకు సైతం ఇంటి స్థలాలు కేటాయించి ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో రైతులకు వరి ధాన్యానికి రికార్డు స్థాయిలో ధర లభిస్తోందని పేర్కొన్నారు. రైతులు రూ.3 వేల కంటే తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించాల్సిన అవసరం లేదని, ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు.

ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయని, బోర్లు సైతం అడుగంటుతున్నాయని తెలిపారు. రైతులు రెండో పంటగా వరి సాగు చేయకుండా ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాంపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, మంచిప్ప ప్రాజెక్టు ద్వారా గ్రామానికి సాగునీరు అందించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వి. భుజంగరావు, రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తారాచంద్ నాయక్, సాయారెడ్డి, పొలసాని శ్రీనివాస్, ఉమ్మాజి నరేష్, చింతల కిషన్, వివిధ శాఖల అధికారులు, గ్రామాల సర్పంచులు, పార్టీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ఎల్లారెడ్డిపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి…

0
ఎల్లారెడ్డిపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలు.. చికిత్స పొందుతూ మృతి... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి...

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదు.. నిరాశలో సీనియర్ నాయకులు!

0
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదు.. నిరాశలో సీనియర్ నాయకులు! పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరిస్తున్నారని ఆవేదన బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సీనియర్ కార్యకర్తల అసంతృప్తి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్...

గోనుగొప్పులలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం…

0
గోనుగొప్పులలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా భరోసా అందేలా కృషి చేస్తాం : సర్పంచ్ సేపూర్ చరణ్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా...

యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశం…

0
యువజన కాంగ్రెస్ సమీక్షా సమావేశం సంస్థాగత బలోపేతం, పార్టీ కార్యక్రమాలపై చర్చ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా : భీమ్‌గల్ : బాల్కొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు సేపూర్ చరణ్...

భక్తిపారవశ్యంతో ఘనంగా శ్రీ చక్రతీర్థం…

0
భక్తిపారవశ్యంతో ఘనంగా శ్రీ చక్రతీర్థం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా పూజా కార్యక్రమాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా : భీమ్‌గల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నింబాచల శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న...

Translate »
error: Content is protected !!