బాబానగర్, బాబాపూర్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియ పరిశీలన
నమోదు ప్రక్రియను పరిశీలించిన ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా : భీంగల్ మండలం బాబానగర్, బాబాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. భీంగల్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, ఎన్రోల్మెంట్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు.
బీమా పొందాలనుకునే దరఖాస్తుదారులు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో పాటు వ్యక్తిగత వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా నామినీకి సంబంధించిన వివరాలను కూడా అధికారులకు అందజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

























