ఎల్లారెడ్డిపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలు.. చికిత్స పొందుతూ మృతి…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామ శివారులో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10:30 గంటల సమయంలో సీతయ్యపేట గ్రామానికి చెందిన శ్రీ వర్ధన్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై ఎల్లారెడ్డిపల్లి గ్రామ శివారులోని భారతమాత విగ్రహం సమీపంలో అతివేగంగా, అజాగ్రత్తగా ప్రయాణిస్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు.
ఈ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు.
మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇందల్వాయి ఎస్సై సుమలత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
యువకుడి మృతితో సీతయ్యపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

























