Homeఆరోగ్యంగర్భాశయ క్యాన్సర్ రాకుండా హెచ్ పి వి టీకా ఇప్పించాలి

గర్భాశయ క్యాన్సర్ రాకుండా హెచ్ పి వి టీకా ఇప్పించాలి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి యందు 14 సంవత్సరముల బాలికలందరికి సర్వైకల్ క్యాన్సర్ నివారణకై హెచ్ పి వి టీకాలు జిల్లా కలెక్టర్  ఇలా త్రిపాటి  ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ  తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని వైద్యాధికారులు ,పిహెచ్ స్సి పర్యవేక్షణ అధికారులు మరియు వైద్య సిబ్బందికి జూమ్ మీటింగ్ ద్వారా హెచ్పీవీ వ్యాక్సినేషన్ మరియు ఇతర జాతియ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ హెచ్ పి వి అనేది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇది పునరుత్పత్తి మార్గం యొక్క సాధారణ సంక్రమణ అని అంటారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నకు ప్రధాన కారణం ఈ హెచ్ పి వి వైరస్ అవుతున్నది. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ  చేతుల మీదుగా ఫిబ్రవరి 28 రోజున ఇది ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అదే రోజు  ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేత ప్రారంభిoచడం జరిగిందన్నారు.భారతదేశ మహిళల్లో రొమ్ము క్యాన్సర్ తర్వాత రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అయినందున దీనిని అరికట్టడానికి హెచ్ పి వి టీకాలు వేయడం జరుగుచున్నది. హెచ్పీవీ టీకాలు వేయడం, క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ కొత్త కేసులను మరియు మరణాలను తగ్గించవచ్చు అన్నారు. జిల్లాలో 14 సంవత్సరాల వయస్సున్న బాలికలు మొత్తం 12363 ఉన్నారని వీరందరికీ మొదటగా మార్చి 8 నాడు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మరియు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుందని తరువాత అన్ని పీహెచ్సీలలో ప్రారంభమవుతుందన్నారు .కావున జిల్లా ప్రజలందరూ ఇది కొత్త వ్యాక్సిన్ కాదని ఇది 2006 సంవత్సరం నుండి ఇవ్వడం జరుగుతున్నదని అన్నారు. అదేవిధంగా హెచ్ పి వి వ్యాక్సిన్ గార్డసిల్-4 చాలా ఖరీదైందని సుమారు ఐదు వేల నుండి ఆరు వేయిల రూపాయలు విలువ చేసే హెచ్ పి వి వ్యాక్సిన్ ను ప్రభుత్వ హాయంలో అర్హులైన 14 సంవత్సరాల అమ్మాయిలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున జిల్లా ప్రజలు సంతానం కలగదని, గర్భస్రావాలు అవుతాయని, పుట్టుకతో వచ్చే లోపాలకు కారణమవుతుందని, లాంటి ఎటువంటి అపోహలకు గురీ కావద్దని, ఇది చాలా సురక్షితమైన టీకా అని అర్హులైన 14 సంవత్సరాల అమ్మాయిల అందరికీ అంటే 7మార్చి 2011 నుండి 8 మార్చి 2012 మధ్యలో పుట్టిన అమ్మాయిలకు ఇప్పించాలన్నారు. 100% అర్హులైన అమ్మాయిలందరికీ హెచ్ పి వి టీకా ఇచ్చేలా వైద్యాధికారులు, పర్యవేక్షణ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, జిల్లా ఉప వైద్యాధికారులు డాక్టర్ రవీందర్ డాక్టర్ సమత డాక్టర్ అశ్విని, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్వేత, డాక్టర్ వెంకన్న, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శ్రావ్య, డి పి ఓ విశాల,

డి హెచ్ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, ఫార్మసీ అధికారి నారాయణ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

సైబర్ నేరగాళ్లపై ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0’ నిఘా : డైరెక్టర్ శిఖా గోయల్

0
సైబర్ నేరగాళ్లపై 'ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0' నిఘా : డైరెక్టర్ శిఖా గోయల్ హైదరాబాద్: ఏప్రిల్ 26:రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసిఎస్బి) సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది....

ఎసిసి సిమెంట్ ఆధ్వర్యంలో మేస్త్రీలకు సిమెంటుపై అవగాహన సదస్సు

0
ఎసిసి సిమెంట్ ఆధ్వర్యంలో మేస్త్రీలకు సిమెంటుపై అవగాహన సదస్సు ఆదివారం : 2604/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి మండలంలో ఎసిసి సిమెంట్ వారు ఆదివారం మండల కేంద్రంలోని తాపీ మేస్త్రీలకు...

అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు ఆభరణాలు సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా.....

0
అంగరంగ వైభవంగా వాసవి మాత జయంతి వేడుకలు... ఆభరణాలు సమర్పించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా... కన్నులపండుగగా శోభాయాత్ర... ఇందూరు: వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్...

స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 

0
స్వీయ గణనలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  ఇందూరు: జనగణన 2027 లో భాగంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా స్వీయ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం నగరంలోని తన...

జిల్లా మీసేవ ఫెడరేషన్ సమావేశం విజయవంతం… కమిషన్ పెంపుకు కృతజ్ఞతలు,కొత్త కేంద్రాలకు బ్రేక్ ..జిల్లా మీసేవ ఫెడరేషన్ అధ్యక్షులు సితారే...

0
జిల్లా మీసేవ ఫెడరేషన్ సమావేశం విజయవంతం… కమిషన్ పెంపుకు కృతజ్ఞతలు,కొత్త కేంద్రాలకు బ్రేక్ .. జిల్లా మీసేవ ఫెడరేషన్ అధ్యక్షులు సితారే క్షవీన్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మీసేవ ఫెడరేషన్ ఆధ్వర్యంలో...

Translate »
error: Content is protected !!