Homeత్రిశూల్ న్యూస్గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి దిశానిర్దేశం కందకుర్తి...

గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి దిశానిర్దేశం కందకుర్తి పుష్కరఘాట్ సందర్శన

*గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి*

*అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి దిశానిర్దేశం*

*కందకుర్తి పుష్కరఘాట్ సందర్శన*

నిజామాబాద్, మార్చి 31 : వచ్చే ఏడాది జూలైలో అట్టహాసంగా జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పక్షం రోజుల క్రితం కూడా ఈ పుష్కర ఘాట్ ను సందర్శించిన సమయంలో అధికారులకు పురమాయించిన పనులను వారు ఏమేరకు చేపట్టారు అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పుష్కర ఘాట్ కు వచ్చే మార్గాలలో రహదారుల మరమ్మతులు, విస్తరణ పనులను, శివాలయం వద్ద కొనసాగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టాలని అన్నారు. పుష్కరాల సమయంలోనే కాకుండా ఈ ప్రదేశానికి సాధారణ సమయాలలోనూ భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్ధం పరిసరాల పరిశుభ్రతతో పాటు భక్తులకు కనీస వసతులు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు. గోదావరి పుష్కరాలకు త్రివేణి సంగమ ప్రాంతం అయినందున ఈ ఘాట్ వద్ద పుణ్య స్నానాల కోసం ప్రముఖులతో పాటు, లక్షలాదిగా భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చే అవకాశాలు ఉన్నందున ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాకపోకలకు ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు ఆయా మార్గాలలో అవసరమైన చోట కల్వర్టుల నిర్మాణాలు సైతం చేపట్టాలన్నారు. వి.వి.ఐ.పీల కోసం హెలిప్యాడ్ ను నిర్మించాలని, వాహనాల పార్కింగ్, మరుగుదొడ్లు, తాత్కాలిక గదులు, భక్తులు బస చేసేందుకు వీలుగా తగిన వసతి, షామియానాలు వంటి వాటిని నాణ్యతతో చేపట్టి నిర్ణీత గడువు లోపు పూర్తి చేసేలా చూడాలన్నారు. ఘాట్ వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ కందకుర్తి గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెంజల్ మండల అధికారులతో సమావేశం అయ్యారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, జనాభా గణన ప్రక్రియల నిర్వహణపై కీలక సూచనలు చేశారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, దేవాదాయ శాఖ అధికారులు కమల, విజయరామారావు, తహసిల్దార్ శ్రవణ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

పూణే కార్పొరేటర్లు GB సమావేశంలో నీటి సరఫరా సమస్యలను లేవనెత్తారు, మేయర్ పరిష్కారాలను కోరుతున్నారు

0
పుణె: తమ తమ ప్రాంతాల్లో సరైన నీటి సరఫరా జరగడం లేదని పలువురు కార్పొరేటర్లు శుక్రవారం జరిగిన పౌరసరఫరాల సంస్థ సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించారు.నీటి అంతరాయాలు గత రెండు రోజులకు...

ఆర్‌ఎంసి ప్లాంట్లను తరలించాలని ధయారీ వాసులు డిమాండ్ చేస్తున్నారు

0
పూణే: పూణె మునిసిపల్ కార్పొరేషన్ (పిఎంసి)ని మూసివేసి, తమ పరిసరాల్లో పనిచేస్తున్న రెడీ మిక్స్ కాంక్రీట్ (ఆర్‌ఎంసి) ప్లాంట్‌లను తరలించాలని డిమాండ్ చేస్తూ ధయారీ నివాసితులు శుక్రవారం నిరసన ప్రదర్శన...

ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం

0
ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం  నిజామాబాద్ జిల్లా లో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.కూరపాటి అరుణ్ జ్యోతి ఆర్టీసీ కార్మికులకు సంఘీ భావం...

మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ..

0
మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి కృషి  అర్బన్ ఎమ్మెల్యే తో మాజీ సైనికుల సంక్షేమ సంఘం భేటీ.. ఇందూరు: మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే...

ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు

0
ధర్పల్లి: భక్తిశ్రద్ధలతో జగదాంబ మాత ఆలయ ఉత్సవాలు శుక్రవారం : 24/04/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో శ్రీ జగదాంబ మాత, సేవలాల్ మహారాజ్, రామ్ రామ్...

Translate »
error: Content is protected !!