ధర్పల్లి: అకాల వర్షంతో వరి పంట నష్టం
ఆదివారం : 05/04/26/ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి మండలం బెయిలా తండాలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి పంట పూర్తిగా నష్టపోయినట్లు రైతులు తెలిపారు. పంట చేతికి వచ్చే సమయంలో వర్షం పడి నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దాదాపు 70 ఎకరాల్లో వరి పంట నష్టపోయినట్లు చెప్పారు. తక్షణమే ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.























