Homeత్రిశూల్ న్యూస్సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల...

సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశం

ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,


ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, సమావేశంలో పాల్గొన్న హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, ఫార్వర్డ్ బ్లాక్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ ప్రసాద్, సింగరేణి కార్మికులు*

*కల్వకుంట్ల కవిత గారి కామెంట్స్*

*సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం*

*కార్మికుల నియామకాలపై కాదు మీ అవినీతిపై ఎంక్వైరీ జరిపించాలి*

*కాంగ్రెస్ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఫైర్*

*కార్మికులకు ఉద్యోగాలు ఇస్తే ఎంక్వైరీ చేస్తారా.. ఆ మాటలు బంద్ పెట్టి ముందు మెడికల్ బోర్డు పెట్టండి*

*కార్మికుల వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనేది అప్ప ప్రభుత్వ పాలసీ*

*రాజస్థాన్ లో సోలార్ ఒప్పందం, లిథియం రిఫైనరీ కోసం చిన్న సంస్థతో ఒప్పందంలో జరిగిన అవినీతిపై విచారణకు సిద్ధమా?*

*సింగరేణికి ప్రభుత్వం బాకీ ఉన్న రూ.47 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలి*

సింగరేణిని కాపాడుకునేందుకు మరో ఉద్యమానికి సిద్ధమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. డిపెండెంట్ కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనడం విడ్డూరంగా ఉందని మండి పడ్డారు. కార్మికుల నియామకాలపై కాదు మీ ప్రభుత్వ అవినీతిపై విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు

బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో *సేవ్ సింగరేణి* రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పై ఫైర్ అయ్యారు

ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రం లోనైనా సహజ వనరులను అక్కడి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడేందుకు ప్రయత్నం చేస్తారు.

ప్రకృతి మనకు బొగ్గు వరంగా ఇచ్చింది. దీన్ని ప్రజలకు మేలు చేసే విధంగా వాడేలా ప్రభుత్వం ఉండాలి.

కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవో…ఇప్పుడు అలాగే పరిస్థితులు ఉన్నాయి.

అప్పుడు మన తెలంగాణ వాళ్లు దుబాయి, బొంబాయి, బొగ్గు బాయి అంటూ వెళ్లేవారు.

మనకు తినటానికి తిండి లేని సమయంలో కార్మికులకు తిండి పెట్టిన సింగరేణిని మనం సిరులవేణి అని తలుచుకుంటాం.

కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి సింగరేణితో ఎలాంటి భావోద్వేగం లేదు. అందుకే కార్మికుల సమస్యలు వారికి తెలియటం లేదు.

సింగరేణి లో నుంచి బొగ్గు తీసేందుకు కార్మికులు ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు.

అక్కడి గాలి పీల్చుకుంటే ఊపిరితిత్తుల్లోకి వెళ్లి బ్లాక్ అవుతుంది. కాళ్లు వంకర అయ్యే పరిస్థితి ఉంటుంది.

కాలే కడుపుతో పోయి కాలే బొగ్గు తీసుకొచ్చే వాళ్లు మన కార్మికులు.

కానీ ఈ విషయం ఏమాత్రం తెలియని ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉండటంతో వారికి మన కష్టాలు తెలియటం లేదు.

తెలంగాణ సాధించుకున్న తర్వాత మనం కొంతమందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చుకున్నాం.

ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో నష్టపోయాం. అందుకే కొన్ని సడలింపులు ఇచ్చుకొని 20 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాం.

దీంతో ఒక 20 వేల మంది భద్రతతో బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను పడింది.

ఈ ఉద్యోగాలు ఎలా ఇచ్చారన్న దానిపై ఎంక్వైయిరీ వేస్తారంట?

వాళ్లకు ఉద్యోగాలు ఎందుకు ఇచ్చామన్న కారణం డిప్యూటీ సీఎం భట్టి  తెలుసుకోవటం లేదు.

ఆనాటి గవర్నమెంట్ పాలసీ అది. దానిపై ఎలా ఎంక్వైరీ చేస్తారు?

సింగరేణి తో పెట్టుకున్న ఏ నాయకుడు కూడా బాగుపడలేదు.

సింగరేణి కార్మికులతో పెట్టుకోవద్దని భట్టిగారిని నేను హెచ్చరిస్తున్నా.

ఓబీ కాంట్రాక్టులు, డీజిల్ కుంభకోణాలు, కరెప్ట్ నాయకులు, అధికారుల మీద ముందు ఎంక్వైయిరీ వేయండి.

కష్టపడి చెమటోడ్చే కార్మికుల మీద ఎంక్వైయిరీ లు వేయటం ఏంటీ?

సింగరేణి బొగ్గు మింగి అవినీతికి పాల్పడిన వాళ్ల మీద విచారణ జరపాలి.

భట్టి  మీద నాకు కొంచెం గౌరవం ఉండేది. కానీ సింగరేణి కార్మికుల మీద మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు విన్నాక చాలా బాధ అనిపించింది.

ఆయన కార్మికుల గురించి మాట్లాడిన అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా.

కార్మికుల మీద ఎంక్వైయిరీ వేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నా.

డీజిల్ కుంభకోణం ద్వారా 250 కోట్లు, నిబంధనల ఉల్లంఘన కారణంగా 74 కోట్లు, లీకేజీ ల కారణంగా 24 కోట్లు, అదనపు వసూళ్లు చేయలేక 1078 కోట్లు సంస్థకు నష్టం చేశారు.

ఇది నేను కాదు, కాగ్ చెబుతున్న రిపోర్ట్. దీని మీద ముందు ఎంక్వైయిరీ వేయాలి.

మీ చేతగాని తనంతో సింగరేణికి నష్టం చేస్తున్నారు. కార్మికులు సంస్థను కాపాడుతున్నారు.

కిషన్ రెడ్డి వెళ్లి మాట్లాడగానే సంస్థలో బొగ్గు ప్రొడక్షన్ మారుతుంది.

చెమట చిందించి లాభాలు తెస్తున్న కార్మికులకు లాభాల్లో వాటా ఇస్తే అభ్యంతరం ఏంటీ?

స్వయంప్రతిపత్తి కలిగిన సింగరేణికి…ప్రభుత్వం పెట్టే రూల్స్ అప్లయ్ కావు.

బొగ్గు, కరెంట్ బకాయిలు కలిపి సింగరేణికి ఈ ప్రభుత్వం 47 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది.

వాటిని చెల్లించకపోవటంతో కార్మికుల సేప్టీకి, వారి జీతాలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో రాజస్థాన్ తో సోలార్ ఒప్పందం, అదే విధంగా చిన్న కంపెనీతో లిథియం రిఫైనరీ అంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు.

సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు యువ కార్మికులకు కూడా తెలియాలి.

లిథియం రిఫైనరీ కోసం అల్ట్ మిన్ అనే చిన్న సంస్థతో సింగరేణి 2250 కోట్ల ఒప్పందం చేసుకుంది.

ఈ సంస్థను 2023 లో ఏర్పాటు చేశారు. ఆ సంస్థ మొత్తం ఆదాయం రూ. 27 లక్షలు మాత్రమే.

అలాంటి చిన్న కంపెనీతో సింగరేణి 2250 కోట్ల ఒప్పందం ఎలా చేసుకుంటుంది?

సింగరేణి విషయంలో సిన్సియార్ ఉంటే ముందు ఈ ఒప్పందాల విషయం చెప్పండి?

అల్ట్ మిన్ కంపెనీ విషయంలో బ్యాంక్ గ్యారంటీలు ఎవరివీ? సింగరేణి వాటా ఎంత? ఆ సంస్థను ఎందుకు పార్ట్ నర్ గా చేశారు?

ప్రపంచ వ్యాప్తంగా లిథియం రిపైనరీలు పెట్టిన పెద్ద సంస్థలే నష్టాల్లో ఉన్నాయి.

అలాంటి ఊరు, పేరు లేని సంస్థతో ఈ ఒప్పందం ఎందుకు చేసుకున్నారు.

రాజస్థాన్ తో 11 వేల కోట్ల ఒప్పందంలో సింగరేణి వాటా 72 వేల కోట్లు అంటున్నారు.

ఒక మెగావాట్ ఉత్పత్తికి అయ్యే దాని కన్నా మూడు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.

అవుట్ రైట్ గా ఈ ఒప్పందంలో అవినీతి జరిగింది. దీనిపై మేము లెటర్ రాస్తాం.

ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న వారి పేర్లు, అవినీతి బయట పెట్టాలి.

మెడికల్ బోర్డు ను పాత పద్దతిలో నిర్వహించాలి. గతంలో మెడికల్ బోర్డు పెట్టి మళ్లీ నిర్వహించటం లేదు.

విజిలెన్స్ కేసుల విచారణను పూర్తి చేయాలి.

ఇన్ కం ట్యాక్స్ సింగరేణి కార్మికులు ఉద్యోగులకు ఉండొద్దు.

దీనిపై నేను పార్లమెంట్ లో 2015 లోనే మాట్లాడాను.

ఇన్ కం ట్యాక్స్ మినహాయింపులు ఇస్తే 12 వేల నుంచి 80 వేల వరకు ఉద్యోగులకు, కార్మికులకు మేలు జరుగుతుంది.

ఇది లైఫ్ రిస్క్ సెక్టార్ కావటంతోనే ఇన్ కం ట్యాక్స్ మినహాయింపు అడుగుతున్నాం.

వైద్య పరీక్షల్లో పాసైన 350 మంది అభ్యర్థులకు పోస్టులు ఇవ్వాలి.

ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టులను నింపాలి. సంస్థకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి.

అలియాస్ పేర్ల విషయంలో గతంలో ఉన్న విధంగానే నిబంధనలు ఉండాలి.

హెల్త్ విషయంలో నిమ్స్ రేట్లను కాకుండా కేంద్రానికి సంబంధించి సీజీహెచ్ఎంస్ రేట్లు అప్లయ్ చేయాలి.

సింగరేణి విముక్తి కోసం అవసరమైతే మరో తెలంగాణ ఉద్యమం మాదిరి ఉద్యమం చేస్తాం.

హెచ్ఎంఎస్ చేసే ఉద్యమానికి జాగృతి తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నా.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

0
బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు మంగళవారం : 16/06/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్, జూన్ 16 (త్రిశూల్ న్యూస్): మహారాష్ట్ర రాష్ట్రంలోని హింగోలి జిల్లా భస్మత్ ప్రాంతానికి చెందిన 14...

ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

0
ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

2027 జనాభా లెక్కల మొదటి దశను పూర్తి చేయడానికి రాష్ట్రం 2.2 లక్షల ఎన్యుమరేషన్ బ్లాకులను కవర్ చేస్తుంది

0
కొత్తూరులోని జే భవానీనగర్‌లో జనగణన నిర్వహిస్తున్న పీఎంసీ ఉద్యోగులు పూణే: రాష్ట్రం 2027 జనాభా లెక్కల మొదటి దశ - హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ - సుమారు 2.45...

యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు…

0
యూరియా యాప్ ధర్నాకు రైతుల మద్దతు లేదు... మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ నందిపేట్ జూన్ 16 త్రిశూల్ న్యూస్: సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో జరిగిన...

బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు

0
బాలుడు అదృశ్యం.. గాలిస్తున్న పోలీసులు మంగళవారం : 16/06/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్  నందిపేట్, జూన్ 16 (త్రిశూల్ న్యూస్): మహారాష్ట్ర రాష్ట్రంలోని హింగోలి జిల్లా భస్మత్ ప్రాంతానికి చెందిన 14...

ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ

0
ధర్పల్లి మండల్ పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ మంగళవారం : 16/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత...
Translate »
error: Content is protected !!