99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చంద్రయన్ పల్లి గ్రామం వద్ద లో జాతీయ రహదారిపై వి.ఐ.డి.ఎస్ ను ప్రారంభించిన రాష్ట్ర డిజిపి…
మంగళవారం : 14/04/26/ త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రయన్ పల్లి గ్రామం వద్ద లో జాతీయ రహదారిపై వి.ఐ.డి.ఎస్ ను ప్రారంభించిన రాష్ట్ర డిజిపి.ప్రమాదాలు నివారించాలి ప్రాణాలను రక్షించాలి.రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిపాటించాలి.నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గల 44వ జాతీయ రహదారి గల చంద్రాయన్ పల్లి గ్రామం వద్ద వి.ఐ.డి.ఎస్ (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ) ను తెలంగాణ రాష్ట్ర డిజిపి.బి.శివధర్ రెడ్డి, ఐ. పి.ఎస్. ప్రారంభించారు.ఈ సందర్భంగా రాష్ట్ర డిజిపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు తూచా తప్పకుండా పాటించాలని హెల్మెట్లు తప్పనిసరి ధరించాలని పిల్లలు కూడా హెల్మెట్ ఏర్పాటు చేసి ప్రయాణించాలని జాతీయ రహదారిపై డిఫెన్స్ డ్రైవింగ్ తప్పకుండా పాటించాలని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు సూచనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని వాహనానికి వాహనానికి డిస్టెన్స్ ఉంచాలని వాహనం వేగంగా వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనపై ఆధారపడ్డ వారు కి కన్నీరు మిగిల్చ రాదని సీటు బెల్టు తప్పనిసరి ధరించాలని అన్నారు ఈ నిబంధనలు మన వద్ద ఉంచుకోకుండా ఇతరులకు కూడా అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్కరు కృషిచేయాలనితెలియజేశారు.తదుపరి గ్రామ ప్రజలతో అరేవ్ అలైవ్ కార్యక్రమానికిసంబంధించినటువంటి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది
అనంతరం వి.ఐ.డి.ఎస్ (వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థకు)సంబంధించినటువంటి ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను ప్రారంభించారు.ఇది మానవ ప్రమేయం లేకుండా ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షించడానికి,ఎ ఐ విశ్లేషణలతో కూడిన హై-డెఫినిషన్ నిఘా కెమెరాలను ఉపయోగిస్తుంది.ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్.పి.సాయి చైతన్య,ఐపీఎస్.,అదనపు డీసీపీ(అడ్మిన్)జి.బస్వారెడ్డి,నిజామాబాదు ఇన్చార్జి ఏసిపి.రాజా వెంకటరెడ్డి,ఆర్మూర్ ఏసిపి. వెంకటరెడ్డి,డిచ్ పల్లి సి.ఐ కె.వినోద్,ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ప్రసాద్,ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్.వినోద్,డిచ్ పల్లి ఎస్.ఐ ఆరీఫ్,ఇందల్ వాయి ఎస్.ఐ.జి.సందీప్ ఈ -డార్ మేనేజర్.వర్ష,ప్రాజెక్ట్ మేనేజర్.వంశీధర్,టోల్ ప్లాజా మేనేజర్.వీరబాలు,గ్రామ సర్పంచ్.రఘు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

























