Homeతెలంగాణపేదవానికి చదివే వజ్రాయుధం... ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

పేదవానికి చదివే వజ్రాయుధం… ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

పేదవానికి చదివే వజ్రాయుధం… ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి.

గురువారం : 18/06/26/త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్ 

నందిపేట్ జూన్ 18 త్రిశూల్ న్యూస్… గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నందిపేట మండల కేంద్రంలో పర్యటించి పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జాతీయస్థాయి స్కాలర్షిప్ సాధించిన విద్యార్థులకు స్థానిక మోడల్ స్కూల్లో మెమొంటోను అందజేశారు . 8 తరగతి చదువుతున్న చేపూర్ శ్రీహిత, పాణెం హర్షిత, గొల్లపల్లి అలంకృత, రాచ కనిష్క్,లు మోడల్ స్కూల్లో చదివి జాతీయస్థాయి స్కాలర్షిప్ సొంతం చేసుకోవడం చాలా సంతోషం అంటూ వారిని ఘనంగా శాలువాతో సత్కరించి ఆ పిల్లల తల్లిదండ్రులను, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను అభినందించారు.. . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. డబ్బున్న వాడికి డబ్బుతో పాటు విద్యా, వైద్యం, విలాసం ఇలా రకరకాల సదుపాయాలన్నీ సమృద్ధిగా అందుతాయని డబ్బు లేని వానికే విద్యా వైద్యం విలాసం ఇలా అన్ని భారంగా మారుతాయి అని, అందుకే ప్రతి పేదవానికి విద్య అనేది వజ్రాయుధం లాంటిదని, విద్యతోనే ధనికునితో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పొచ్చని, సమాజంలో మంచి గౌరవం అందుతుందని అందు కొరకు అహర్నిశలు కష్టపడాలని విద్యార్థులకు సూచించారు. కటిక పేదరికమైన చదువు అనే వజ్రాయుధంతో తలరాతను మార్చుకోవచ్చని, అందుకే ఏ ఒక్క విద్యార్థి కూడా నిరాశ నిస్సృహ చెందకుండా చదువుపై మంచి ద్యాస పెట్టి లక్ష్యాలను చేదించాలని, నిరుపేదగా పుట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంతోమంది విద్యార్థుల ఘాతను ఆదర్శంగా తీసుకొని తమ లక్ష్యాలను చేదించాలన్నారు. మొన్నటికి మొన్న ఐపిఎల్ లో వైభవ్ సూర్య వంశీ అనే ఒక 15 ఏళ్ల కుర్రాడు సిక్సులు బాదుతుంటే యావత్ ప్రపంచమంతా నివ్వరపోయిందని, అతి చిన్న వయసులో ఎన్నో రికార్డులను అధిగమించాడని, ఆ బుడ్డోడు సాధించిన ఘనతల వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయని, వారి తల్లిదండ్రులు పడ్డ బాధలు, ఆ బాలుడి పట్టుదల ఆ ఘనతను సాధించేలా చేసిందని ఉదాహరించాడు. జాతీయస్థాయి స్కాలర్షిప్ పొందిన పిల్లలు 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు నాలుగు సంవత్సరాలు సంవత్సరంకు 12 వేల రూపాయల చొప్పున 48 వేల రూపాయలను పొందుతారని ఆయన అన్నారు. అందుకే నన్ను గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేసేందుకు అనునిత్యం అసెంబ్లీలో నిరుపేదలకు విద్య, వైద్యంపైనే మాట్లాడుతున్నానని గుర్తు చేశారు. నిరుపేదలంటే ఇష్టమని ఆ నిరుపేదలకు విద్యా వైద్యం అందకపోతే ఊరుకోనని, పేద విద్యార్థుల కొరకు అహర్నిశలు పాటుపడతానన్నారు. అలాగే గురువులు కూడా ప్రతి పేద విద్యార్థిని తమ పిల్లలుగా అనుకొని నిత్యం వారి వెన్నంటా ఉండి మంచి విద్యా బోధన చేస్తూ మెరకల్లాంటి విద్యా కుసుమాలను తయారు చేయాలని, కుల మత ధన తారతమ్యాలను పక్కనపెట్టి,మంచి క్రమశిక్షణ నేర్పిస్తూ దేశభక్తి గల పౌరులను తయారుచేసి దేశానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈఓ అవధూత గంగాధర్, సర్పంచ్ సిలిండర్ లింగం, మోడల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రవీణ్, నందిపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పటేళ్ల రాజు, బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిలిచిపోయిన అనుమతులను అన్‌లాక్ చేయడానికి 12-18 నెలల్లో నిర్మాణ ప్రణాళికను తీసుకురావాలని PMRDA తెలిపింది

0
ఆమోదించబడిన ఐదు పట్టణ ప్రణాళిక పథకాలను PMCకి బదిలీ చేయడం జరుగుతోందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మాధురీ మిసాల్ తెలిపారు పూణే: అథారిటీ డ్రాఫ్ట్ డెవలప్‌మెంట్ ప్లాన్ (డిపి) రద్దు తర్వాత...

‘ఆధునిక గురుకుల్’, ఎస్కేప్ టన్నెల్, CCTV నిఘా: పూణే ‘గాడ్‌మాన్’ 15 ఏళ్లపాటు మహిళపై నియంత్రణ వలయాన్ని ఎలా...

0
నిందితుడిని రాధామోహన్ మిశ్రాగా గుర్తించారు. పుణె: దైవిక శక్తులు ఉన్నాయని చెబుతూ కొన్నాళ్లుగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు, శారీరకంగా హింసించి, ఆర్థికంగా దోపిడీకి పాల్పడినందుకు గాను స్వయంకృతాపరాధిగా చెప్పుకునే దేవుణ్ణి,...

ట్రాన్సిట్‌లో కేబుల్ బాక్స్‌లు కనిపించకుండా పోవడంతో బుక్ చేసిన డ్రైవర్

0
పూణే: రవాణా సంస్థ డ్రైవర్‌పై డెలివరీ చేయాల్సిన 234 కేబుల్‌ బాక్సుల్లో 10 తప్పిపోవడంతో నిగ్డి పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 316...

లోనావ్లా బంగ్లాపై పోలీసులు దాడి; ఇబ్బందిని సృష్టించడం కోసం పుస్తకం 18

0
పూణే: లోనావ్లా సిటీ పోలీసులు సోమవారం నాడు భంగర్‌వాడి వద్ద ఉన్న బంగ్లాలో అర్ధరాత్రి 1 గంటల సమయంలో బిగ్గరగా సంగీతానికి నృత్యం చేసినందుకు ఏడుగురు మహిళలతో సహా 16...

PCM గ్రూప్ మొదటి ప్రయత్నంలో MHT-CETలో 100 పర్సంటైల్‌తో 26

0
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పూణే: మహారాష్ట్ర MHT CET 2026 ఫిజిక్స్-కెమిస్ట్రీ-గణితంలో మొదటి ప్రయత్నంలో ఇరవై నాలుగు మంది అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు 100...

Translate »
error: Content is protected !!