ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్ 24) సాయంత్రం 6 గంటలకు ఎన్టీఆర్ కాలనీలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ ఉత్సవంలో 18 మంది బాల స్వయంసేవకులు, 7 మంది తరుణ స్వయంసేవకులు కలిపి మొత్తం 25 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా లభిశెట్టి మహేష్, మచ్చ బుచ్చన్న హాజరయ్యారు.
ఈ సందర్భంగా కుటుంబ ప్రబోధన్ ప్రాముఖ్యతను ప్రతిబింబించేలా కాలనీకి చెందిన పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయదశమి ఉత్సవం ఆధ్యాత్మిక, సాంస్కృతిక వాతావరణంలో నిర్వహించబడింది.

























