సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు తాహెర్ బిన్ హందన్, శేఖర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి సునీల్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ చిన్న (శ్రీనివాస్), జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

























