మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్
నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి ప్రతిష్ఠించారు. గత కొన్ని నెలలుగా క్రితమే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ, కొన్ని సమస్యాత్మక కారణాలతో పాటు పోలీసుల అభ్యంతరాల నేపథ్యంలో విగ్రహ ప్రతిష్ఠాపన ప్రక్రియ నిలిచిపోయింది.
ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వీరతనానికి, ధైర్యసాహసాలకు, స్వరాజ్య స్థాపనకు ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మోరాడ్‌లో ఏర్పాటు చేయడంతో ఆయన అభిమానుల్లో ఆనందం నెలకొంది.
అయితే విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించి గతంలో తలెత్తిన సమస్యలు, తాజా పరిణామాలపై స్థానికంగా చర్చ సాగుతోంది. జాతీయ రహదారి పక్కన విగ్రహం ఏర్పాటు చేయడంతో సంబంధిత అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది.

























