మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఏప్రిల్ 28 : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ సీతక్క బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్న నేపధ్యంలో మంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఇంచార్జి మంత్రి పాల్గొననుండగా, కలెక్టర్ ఆడిటోరియంను సందర్శించారు. ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డీఆర్డీఏ సాయన్న, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, డీడబ్ల్యూఓ పద్మ తదితరులు ఉన్నారు.























