Homeతెలంగాణధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం ఐకేపీ ఏపీఎంకు షోకాజ్ నోటీసు...

ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం ఐకేపీ ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశం

ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం

ఐకేపీ ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశం

నిజామాబాద్, ఏప్రిల్ 28 : ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల అలసత్వం వహించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, భీంగల్ మండల ఐకేపీ ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. భీంగల్ మండలం పల్లికొండ, భీంగల్ గ్రామాలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పల్లికొండ కొనుగోలు కేంద్రం నిర్వహణలో లోటుపాట్లు నెలకొని ఉండడాన్ని కలెక్టర్ గమనించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం, రిజిస్టర్ అందుబాటులో లేకపోవడం వంటి లోపాలను గుర్తించిన కలెక్టర్ కేంద్రం నిర్వాహకులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ తీరు ఇలాగే ఉంటే కమీషన్ నిలిపివేస్తామని, వచ్చే సీజన్ నుండి సెంటర్ ను కేటాయించబోమని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదని ఏపీఎం కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. రైతుల ప్రయోజనాలతో ముడిపడిన అంశాలలో విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తెచ్చిన రైతులను పలుకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాయిశ్చర్ యంత్రం ద్వారా తేమ శాతాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ధాన్యం బస్తాలను తూకం వేస్తున్న వేయింగ్ మిషన్ పనితీరును నిశిత పరిశీలన జరిపారు. తరుగు, కోత వంటివి లేకుండా, రైతులు ఏ దశలోనూ నష్టపోకుండా పక్కాగా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. 17శాతానికి లోబడి తేమ శాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం జరిపించి, మిల్లులకు తరలించాలని సూచించారు. వెదర్ యాప్ ఆధారంగా వాతావరణ పరిస్థితుల గురించి ముందస్తుగానే రైతులకు వివరాలు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలన్నారు. ట్రక్ షీట్లను వెంటదివెంట తెప్పించుకుంటూ, ట్యాబ్ ఎంట్రీలను వేగంగా జరిపించాలని, తద్వారా సకాలంలో రైతుల ఖాతాలలో బిల్లులు జమ అవుతాయని అన్నారు. తహసిల్దార్లు, వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా క్షేత్రస్తాయిలో కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ, నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీసీఓ శ్రీనివాస్, స్థానిక అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

గొడవల్లో నోటిని కంట్రోల్ చేయాలి: డీజీపీ సీవీ ఆనంద్

0
గొడవల్లో నోటిని కంట్రోల్ చేయాలి: డీజీపీ సీవీ ఆనంద్ తెలంగాణ : కుటుంబ వ్యవస్థలో దంపతులు సర్దుకుపోవాలని, ఒకరినొకరు అర్థం చేసుకుని మెలగాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. మల్కాజిగిరి పోలీసుల ఆధ్వర్యంలో 'మీ...

ఉప్ప‌ల్ లో ఖత్రి భవన్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ భగాయత్ లో వంజరి...

0
ఉప్ప‌ల్ లో ఖత్రి భవన్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఉప్పల్ భగాయత్ లో వంజరి కుల ఆత్మగౌరవ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి      *ఉప్ప‌ల్ లో సీఎం రేవంత్...

ధర్పల్లి: అంబులెన్స్‌లో మహిళకు ప్రసవం

0
ధర్పల్లి: అంబులెన్స్‌లో మహిళకు ప్రసవం ఆదివారం : త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్  ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన గర్భిణి గీతను ప్రసవం కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో బీబీపూర్ తండా...

రుతుపవనాలు మహారాష్ట్ర తలుపు తట్టాయి, కానీ పొడి-గాలి లాగడం వల్ల లోతట్టు ప్రాంతాలకు ముప్పు ఏర్పడుతుంది

0
నైరుతి రుతుపవనాలు శనివారం రావడంతో దక్షిణ కొంకణ్‌లో చాలా అవసరమైన వర్షం కురిసింది, ఇది రైతులకు ఉపశమనం మరియు ఆశాజనకంగా ఉంది. పూణె: నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించడంతో...

నిషేధించబడిన హుక్కా రుచులు, గంజాయి, మద్యం: పూణెలో అర్థరాత్రి పార్టీ దాడిలో 107 మంది పురుషులు, 49 మంది...

0
పూణే రేవ్ పార్టీకి చెందిన మైనర్లతో సహా 156 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూణె: లోనికండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తులాపూర్‌లో ఆదివారం తెల్లవారుజామున పూణే సిటీ పోలీసుల క్రైమ్...

Translate »
error: Content is protected !!