గోవిందపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్సు
జిందం శ్రీనివాస్‌కు తలకు తీవ్ర గాయం.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించిన వైద్యులు…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం గోవిందపల్లి గ్రామం వద్ద గురువారం ప్రైవేట్ స్కూల్ బస్సు స్కూటీని ఢీకొట్టడంతో జిందం శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానిక సమాచారం ప్రకారం.. గోవిందపల్లి గ్రామం వద్ద లిటిల్ ఆర్ట్స్ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న జిందం శ్రీనివాస్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని అంబులెన్స్‌లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించినట్లు సమాచారం.
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికంగా సమాచారం అందుతోంది. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

























