ధర్పల్లి: 757 మంది విద్యార్థులకు ఇంగ్లీష్–తెలుగు నిఘంటువుల పంపిణీ
PM SHRI పథకంలో భాగంగా విద్యార్థులకు నిఘంటువుల అందజేత…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో గురువారం PM SHRI పథకంలో భాగంగా 757 మంది విద్యార్థులకు ఇంగ్లీష్–తెలుగు నిఘంటువులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాల శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు, పదాల అర్థాలను సులభంగా తెలుసుకునేందుకు నిఘంటువులు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా తెలిపారు.

























