సుద్దపల్లి విద్యార్థులకు క్రీడా కిట్ అందజేత
మండల స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులకు గ్రామ అభివృద్ధి కమిటీ ప్రోత్సాహం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులు మండల స్థాయిలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు సుద్దపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు సుమారు రూ.5,000 విలువైన మార్చ్‌ఫాస్ట్ కిట్‌ను క్రీడాకారులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు దుంపటి భూమయ్య, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ఏరా వినోద్ రెడ్డి, చింతం లింగయ్య, సత్యనారాయణ, నరేష్, పానుగంటి లింగయ్య, బలమొల్ల సాయిలు, సాయిలు, సాగర్, శంకర్, గంగాధర్, సురేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

























