ధర్పల్లిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టిన వార్డు సభ్యుడు నిమ్మల వినయ్ గౌడ్
సోమవారం : 22/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి గ్రామంలోని 7వ వార్డులో వార్డు సభ్యుడు నిమ్మల వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 7వ వార్డులోని పాత మున్నూరు కాపు సంఘం సమీపంలోని దుకాణ సముదాయాల వెనుక భాగంలో పేరుకుపోయిన చెత్తను, అలాగే చెరువు కట్టపై పెరిగిన పొదలను జేసీబీ సాయంతో తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దోమల వ్యాప్తి, అపరిశుభ్రత కారణంగా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు నిమ్మల వినయ్ గౌడ్ తెలిపారు. గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పేందుకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని ఆయన కోరారు. స్థానికులు ఈ కార్యక్రమాన్ని అభినందించి, పారిశుద్ధ్య పనులను నిరంతరం కొనసాగించాలని సూచించారు.

























