ధర్పల్లి నూతన ఎంపీడీవోగా బి. మారుతి బాధ్యతల స్వీకరణ
త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి నూతన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా బి. మారుతి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ధర్పల్లిలో ఎంపీడీవోగా విధులు నిర్వహించిన లక్ష్మారెడ్డి వర్ని మండలానికి బదిలీ అయ్యారు.
వర్ని మండలంలో ఎంపీఓగా సేవలందిస్తున్న బి. మారుతి పదోన్నతిపై ధర్పల్లి ఎంపీడీవోగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మండల కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం మారుతి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు మండల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తానని తెలిపారు.

























