ఎన్టీఆర్ కాలనీ నుండి దుబ్బాక బైపాస్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి
మంగళవారం : 23/06/26/త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి గ్రామ అభివృద్ధిలో భాగంగా ఎన్టీఆర్ కాలనీ నుండి దుబ్బాక బైపాస్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామ సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి, రోడ్డు నిర్మాణానికి అవసరమైన వివరాలను సేకరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ రహదారి నిర్మాణం పూర్తయితే రాకపోకలు మరింత సులభతరం అవుతాయని అన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ కాలనీ, పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ రోడ్డు ద్వారా మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనలో గ్రామ పంచాయతీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఏజ్జా శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి రాకేష్, స్థానిక వార్డు సభ్యురాలు పెండ మమత విష్ణుసాగర్, వార్డు సభ్యులు నిమ్మల వినయ్ గౌడ్, చెలిమెల అజయ్, మజీద్, రెబ్బ శ్రావణ్, పిండి మమత రాజ్‌కుమార్, జమీల్‌తో పాటు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ప్రజాప్రతినిధులు తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు.

























