అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ని మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ నూతన పోలీస్ కమిషనర్ శ్వేత…
హన్మకొండలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంత్రి సురేఖతో భేటీ అయిన వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు సత్య శారద, చాహత్ బాజ్ పాయ్, పోలీస్ కమిషనర్ శ్వేత
ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మహిళలు, చిన్నారుల భద్రత, శాంతిభద్రతలు, నేర నియంత్రణ తదితర అంశాల పై చర్చ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్. శ్వేత ఈ రోజు అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారిని హన్మకొండలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సురేఖ నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతలతో హన్మకొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, శాఖల మధ్య సమన్వయం, ప్రజలకు మెరుగైన సేవల కల్పన, శాంతిభద్రతలు, నేర నియంత్రణ, వుమెన్ సేఫ్టీ తదితర వివిధ అంశాల పై వారు చర్చించారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని, వేగవంతమైన, పారదర్శక పాలనను అందించాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను అమలు చేయాలని మంత్రి వారికి దిశా నిర్దేశం చేశారు.

























