ఉపాధి హామి కులీల పనుల పరిశీలన, వారి సమస్యలను పరిష్కరణకు హామి
నిజామాబాద్, ఏప్రిల్ 29 : బుధవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని మల్కపూర్ గ్రామపంచాయతీ కొత్తపేట తాండలో ఉపాధి హామి కులీల పనులను పరిశీలించి వారి సమస్యలను మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్ మంత్రి వర్యులు సీతక్క అడిగితెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధిహామి కులీలకు గొప్ప చట్టం. పనులు కొరకు వలస పోవడాన్ని అరికట్టడానికి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధానమంత్రి మన్ మోహన్ సింగ్ గాంధీ పేరు మీద 100 రోజులు ప్రవేశపెట్టారన్నారు. ఇప్పుడు ఉపాధి హామి కూలీలకు ఫోటో క్యాప్చర్ చేయలి. సర్వర్ పనిచేయక ఆలస్యమవుతుందన్నారు.
ఎండకాలం ఉపాధి హామి కూలీలు ఉదయమే పనులు చేపట్టి టెంట్, మంచినీరు వసతులు కల్పించలన్నారు. సర్పంచ్, పంచాయతీ సెక్రేటరిలు ఉపాధిహామి కూలీలకు మట్టి త్రవేటప్పుడు ముందు రోజే ట్రాక్టర్లతో నీరు తడిపితే నెలనాని త్వరగా త్రవ్వడానికి వీలవుతుందని సూచించారు.
మహిళ సంఘాల ద్వారా ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించుకోనుటకు ఒక లక్ష ఋణం అందజేస్తామని, ఒకవేళ మహిళా సంఘం వారు చనిపోతే 10 లక్షల రూపాయలు జీవిత భీమ ద్వారా అందజేస్తామన్నారు. మహిళ సంఘాలకు 60వేల కోట్లు అందజేసామన్నారు. విద్యుత్ 200 యూనిట్లు వరకు ఉచితం, సన్నబియ్యం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నమన్నారు. గ్రామంలో రోడ్డు వేయడానికి 50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు స్కూల్ పై కప్పు కూలీపోయినందున ఎస్టిమెషన్ ప్రతిపాదనలు పంపాలన్నారు.
మల్కపూర్ గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇంఢ్లు పథకం క్రింద మంజూరైన మంజూల సాయగౌడ్ వారి ఇళ్ళును మంత్రి సీతక్క, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, సర్పంచ్ శ్రీధర్ గౌడ్ లతో గృహ ప్రవేశం చేసారు.
ఈ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, అన్వేష్ రెడ్డి, తహెర్ బిన్ హందాన్, సర్పంచ్ శ్రీధర్ గౌడ్, జెడ్పి సిఈఓ సాయగౌడ్, డిఆర్డిఓ సాయన్న, తదితరులు పాల్గొన్నారు.

























