ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
వ్యాధులపై అవగాహనతోనే ఆరోగ్య సమాజం సాధ్యం: వైఆర్జీ కేర్ ప్రతినిధి గర్దాసు సుధాకర్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
బిక్కనూరు: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వైఆర్జీ కేర్ ఉమ్మడి జిల్లా రిసోర్స్ పర్సన్ గర్దాసు సుధాకర్ అన్నారు. సోమవారం బిక్కనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఆర్జీ కేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో లింక్ వర్కర్స్ స్కీమ్
ప్రాజెక్టును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో హెచ్ఐవీ, లైంగిక వ్యాధులు, క్షయవ్యాధి (టీబీ)పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధిగ్రస్తులకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యా ధికారిని
హేమామి,లింక్ వర్కర్ స్కీమ్ సుకన్య, వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

























