తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కమిటీ సమావేశం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ ఎన్ ఆర్ భవన్ లో జరిగినది ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు.డి. రాజేశ్వర్.జిల్లా కార్యదర్శి. మామిడాల.వెంకన్న. మాట్లాడు తూ బీడీ కార్మికులకు నెలకు ఇచ్చే ఈపీఎఫ్ మినిమం పెన్షన్ ను1000 రూపాయలుగా ఉన్న దానిని నేటి ధరలకు అనుగుణంగా,కుటుంబ జీవనానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చే నెలవారి పెన్షన్ ను. నెలకు9000రూపాయలుగా పెంచి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.ఈ సమస్యపై ఈనెల 16న నిజామాబాద్ పిఎఫ్ రీజినల్ కమిషనర్ గారికి మెమరాండం ఇవ్వాలని నిర్ణయించినది. గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాలలో బందున్న శివాజీ బీడీ కంపెనీ యాజమాన్యం వారు. కార్మికుల సమస్యలు పరిష్కరించి.బ్రాంచీలు తెరచి కార్మికులకు పని కల్పించాలని. కార్మికుల సమస్యలైన నెలకు 26 రోజులకు పని ఇవ్వాలని. వేయి బీడీలకు సరిపోయే అంత నాణ్యమైన తుని కాకు వ్వాలని. కంపెనీ చాట్ చేసిన బీడీలను కార్మికులకే వాపస్ ఇవ్వాలని.ఇతర కార్మికులు చేస్తున్న డిమాండ్లను శివాజీ బీడీ కంపెనీ యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని యూనియన్ తీర్మానించింది.ఈ సమావేశంలో యూనియన్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు. బి మల్లేష్ జిల్లా సహాయ కార్యదర్శి డి కిషన్. క్యాషియర్ యు.లాలయ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ కే వసంత.ఎండి ఇంతియాజ్.జే భాగ్య.జి అంజమ్మ తదితరులు పాల్గొన్నారు























